Abn logo
Sep 15 2021 @ 04:23AM

సైన్యాన్ని కాపాడుకునేలా యుద్ధ వ్యూహాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: యుద్ధాల్లో సైనిక నష్టాన్ని నివారించే.. జవాన్లు గాయాలపాలు కాకుండా కాపాడే నాన్‌-కాంటాక్ట్‌ వార్‌ఫేర్‌ వ్యూహరచన, రక్షణకు సంబంధించి ప్రభుత్వ రంగ విభాగాల సంస్కరణ, రక్షణ రంగానికి సంబంధించి పనికిరాని చట్టాల తొలగింపు, సైన్యంలో స్థానిక భాషల పెంపు తదితర అంశాలపై మహాదళపతి జనరల్‌ బిపిన రావత్‌ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ దృష్టి సారించింది. ప్రధాని మోదీ ఆదేశాల అమలుకు అవసరమైన రోడ్‌మ్యా్‌పను రూపొందించేందుకు ఈ టాస్క్‌ఫోర్స్‌లోని సభ్యులు త్వరలోనే సమావేశం కానున్నారు.