Abn logo
Jun 4 2020 @ 17:04PM

మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్స్

విశాఖ: మావోయిస్టులకు వ్యతిరేకంగా అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరిట వాల్ పోస్టర్స్ వెలిశాయి. జి. మాడుగుల మండలం మద్దిగరువు, బోయితిలి, కిలంకోట, బంధవీధిలో ఈ పోస్టర్స్ వెలిశాయి. ‘గిరిజన ద్రోహులు మావోయిస్టులు అశోక్, శ్రీను, శ్రీకాంత్‌లు... గిరిజనులై ఉండి మా గిరిజనులను చంపుతారా? మావోయిస్టులారా మీ పద్దతి మారకపోతే మా గిరిజన చేతిలో శిక్ష తప్పదు’ అని పోస్టర్స్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement