Advertisement
Advertisement
Abn logo
Advertisement

14 మంది గ్రామ వలంటీర్లకు వేతనాల నిలిపివేత

వర్గపోరులో భాగమేనంటూ ప్రచారం

విడపనకల్లు, డిసెంబరు 4: మండలంలోని 14 మంది గ్రామ వలంటీర్లకు నవంబరు నెల వేతనాలను అధికారులు నిలిపివేశారు. హావళిగిలో ఐదుగురు, డొనేకల్లులో తొ మ్మిది మందికి వేతనాలు అందలేదు. హావళిగి గ్రామ వలంటీర్లు పరుశురాం, శ్రీధర్‌, శశికళ, రమేష్‌, పాతన్న వైసీపీ వర్గపోరులో బాధితులయ్యారు. వేతనాలు నిలిపివేయటానికి అధికారులు పలు కారణాలను చూపుతున్నట్లు తెలుస్తోంది. గృహ హక్కు పథకం ఓటీఎస్‌ సరిగ్గా చేయకపోవటం, వివిధ రకాల ఫిర్యాదులు ఉన్నాయనీ, అందుకే వేతనాలు నిలిపినట్లు అధికారులు చెబుతున్నట్లు సమాచారం. తాము వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గానికి మద్దతు తెలుపుతున్నందున వేతనాలను నిలిపివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో డొనేకల్లు గ్రామంలోనూ తొమ్మిదిమంది వలంటీర్లకు వేతనాలు నిలిపి వేశారు. గ్రామంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నా వేతనాలు నిలిపివేయటానికి కారణాలు తెలియటంలేదని వాపోతున్నారు. వేల్పుమడుగు గ్రామానికి చెం దిన వలంటీర్‌ మౌనిక బళ్లారిలో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. గ్రామంలో రెండు నెలలుగా లేకున్నా, విధులు నిర్వహించకపోయినా ఈ వలంటీర్‌కు నవంబరు నెల వేతనాన్ని మంజూరు చేశారు. నవంబరు నెల పింఛన్లను ఈ వ లంటీరు లాగినలో కాకుండా, వెల్ఫేర్‌ లాగినలో పంపిణీ చేశా రు. ఒక్కరోజు కూడా విధులు నిర్వహించకున్నా నవంబరు నెల వేతనం మంజూరు చేశారు. వేల్పుమడుగులో గ్రామ వలంటీర్‌ విధులు నిర్వహించకపోయినా వేతనం ఇస్తున్నారనీ, ఇదెక్కడి న్యాయమంటూ ఆరోపించారు. ఈ పరిణామాలతో మండలంలో వైసీపీ వర్గపోరు కొట్టొచ్చినట్లు కనిపిస్తోం ది. ఈ విషయమై ఎంపీడీఓ శ్రీనివాసులును వివరణ కోరగా, ఫోనలో ప్రతి విషయం చెప్పలేననీ, మీటింగ్‌లో ఉన్నానంటూ ఫోన కట్‌ చేశారు.

Advertisement
Advertisement