Abn logo
Jul 31 2021 @ 00:48AM

సమాజ హితం కోరుకునే వాడే న్యాయవాది..

జాతీయ బార్‌కౌన్సిల్‌ సభ్యుడు ఆలూరి రామిరెడ్డి

కదిరిఫీచర్స్‌, జూలై 30: ప్రభుత్వం ప్రోత్సాహం లేకున్నా..  అర్ధాక లితో ఉన్నా చేపట్టిన వృత్తిలో సమాజ హితాన్నే న్యాయవాది కోరుకుంటారని జాతీయ బార్‌కౌన్సి ల్‌ సభ్యుడు ఆలూరి రామిరెడ్డి అ న్నారు. శుక్రవారం నాయవాదుల సంఘం కార్యాల యంలో అధ్యక్షుడు లింగాల లోకేశ్వరరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన  న్యాయవాదులకు ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామిరెడ్డి పా ల్గొని మాట్లాడారు. తొలుత కరోనా ఇతర కారణాల వల్ల మృతి చెందిన న్యాయ వాదులకు సంతాప సూచికగా రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటిం చారు. అనంతరం రామిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాది వృత్తికి సమాజంలో ఎంతో గౌరవం ఉందని, దానిని కాపాడాల్సిన నైతిక బాధ్యత మనందరి పై ఉందన్నారు.. బార్‌కౌన్సిల్‌ జాతీయ కౌన్సిల్‌ ఉపాధ్యక్షులుగా, సభ్యులుగా న్యాయవాద సమస్యల కోసం అవ గాహన ఉన్న వ్యక్తిగా ప్రతి సమావేశంలోనూ చర్చించి ఎంతో పురోగతిని సాధించా మని కూడా స్పష్టం చేశారు. వృత్తి నైపుణ్యం కోసం బార్‌కౌన్సిల్‌, జాతీయ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులను కూడా జూనియర్‌ న్యాయవా దులకు ఇప్పించడం జరుగుతోందని ఆ అవకాశాలను కూడా న్యాయవాదులు సద్వినియోగం చేసుకుని రాణించాలని హితవు పలికారు. కదిరి న్యాయవాదుల సంఘం లైబ్రరీకి రూ. 50 వేలు విలువ చేసే పుస్తకాలు బార్‌కౌన్సిల్‌ ద్వారా న్యాయవాదులకు అవసరమైన ఫర్నీచర్స్‌ తన సొంత డబ్బుల ద్వారా సమకూర్చగలనని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామి రెడ్డిని న్యాయవాదుల సంఘం దుశ్శాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించింది. కార్య క్రమంలో న్యాయవాదులు వేణుగోపాల్‌శర్మ, నారాయణరెడ్డి, జొన్నా నాగశేషయ్య, సుబ్బరాజు గుప్తా, చౌడప్ప, ఏ క్రిష్ణమూర్తి, అనం తపురం న్యాయవాదులు వాల్మీకీ గంగాధర్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యాయవాదులకు ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. 

    ధర్మవరం: న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని జాతీయ బార్‌కౌన్సిల్‌ సభ్యుడు ఆలూరి రామిరెడ్డి రామిరెడ్డి తెలి పారు. ధర్మవరంలోని  కోర్టులో ఉన్న బార్‌ అసోసియేషన కార్యాలయంలో శుక్రవారం న్యా యవాదులకు సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులను ఆయన  అందించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ...న్యాయవాదులుగా ఎవరైతే ప్రాక్టీస్‌ చేస్తున్నారో వారికి మాత్రమే గుర్తింపుకార్డులతో పాటు సర్టిఫికెట్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌(సీఓపీ)ను అందిస్తున్నా మన్నారు. 35ఏళ్లు పైబడిన న్యాయవాదులకు వెల్ఫేర్‌ ఫండ్‌కు అర్హులుగా గుర్తించేం దుకు కృషిచే స్తామన్నారు. కరోనా విపత్కర సమయంలో అర్హులైన న్యాయవాదులకు రుణాలు కూడా మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన అధ్యక్షుడు గుంటప్ప, ఉపాధ్యక్షులు సుబ్బరావు, జనరల్‌ కార్యదర్శి లక్ష్మీనారాయణ, జాయింట్‌ కార్యదర్శి నరేశ, కోశాధికారి మూర్తీ, సీనియర్‌ న్యాయ వాదులు విశ్వేశ్వరరావు, అతావుల్లా, రామకృష్ణారెడ్డి, న ల్లప్ప, హుసేనబాషా, కృష్ణమూ ర్తి పాల్గొన్నారు.