Advertisement
Advertisement
Abn logo
Advertisement

డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసన

గూడూరు, డిసెంబరు 7: ఏపీ జేఏసీ-అమరావతి పిలుపుమేరకు మంగళవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా ల జేఏసీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పీఆర్‌సీ అమలు, సీపీఎస్‌రద్దు, పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదల, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైజేషన్‌ తదితర సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపామన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్‌ నాగరాజుకుమార్‌, శ్రావణ్‌కు మార్‌, తనూజ్‌కుమార్‌, అశోక్‌, శివకుమార్‌రెడ్డి, చిరంజీవి, సుధీర్‌, రవి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


 చిల్లకూరులో..


 మండలంలోని పారిచెర్లవారిపాళెం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం పీఆర్‌సీ అమలు చేయాలని నల్లబ్యాడ్జీలు ధరించి  విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు శివరామిరెడ్డి, కళ్యాణి, వీవీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


 వెంకటగిరిలో..


వెంకటగిరి, డిసెంబరు 7: ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియ చేశా రు. ఈ సందర్భంగా ఎన్‌జీవోల సంఘం సెక్రటరీ దుప్పటి ఫణీంద్ర మాట్లాడుతూ  ఈ నెల 10వతేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులు నల్లబాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని, 13వతేదీన నిరసన ర్యాలీని  చేపడతారని తెలిపారు.


 రాపూరులో..


రాపూరు, డిసెంబరు 7: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్‌, కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.  రాపూరు తాలూక జేఏసీ నాయకులు తోట మల్లికార్జునరావు, నలగండ్ల మధు ప్రభుత్వ కార్యాలయాలకు చేరుకుని ఉద్యోగుల కార్యాచరణ గురించి వివరించారు. స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించిన ట్లు జేఏసీ నేతలు ప్రకటించారు.

జడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రాంగణంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు


నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఎన్టీవోలు


Advertisement
Advertisement