Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీఎస్‌యూను రాష్ట్రంలోనే ప్రథమ స్థానానికి తీసుకురావాలి

వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ సుందరవల్లి


వెంకటాచలం, డిసెంబరు 1 : విక్రమ సింహపురి యూనివర్సిటీని రాష్ట్రంలోనే ప్రథమ  స్థానానికి తీసుకురావాలని వైస్‌ చాన్సలర్‌ సుందరవల్లి ఆకాంక్షించారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో బుధవారం అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశా, నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీఎస్‌యూకు నాక్‌ గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, దీనికి ప్రతి అధ్యాపకుడు తన వంతు కృషి చేయాలని కోరారు. సమయపాలన, విద్యార్థులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం వీఎస్‌యూ ప్రాంగణంలో ఉన్న బాలికల, బాలుర వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 


వీఎస్‌యూలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం

వీఎస్‌యూలో బుధవారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్‌రిబ్బన్లు అందరికి పంచి హెచ్‌ఐవీ గురించి వివరించారు. కార్యక్రమంలో వీసీ సుందరవల్లి, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి, రెక్టార్‌ ఎం.చంద్రయ్య, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాఎస్‌ నాయర్‌ తదితరులున్నారు. 

Advertisement
Advertisement