Abn logo
Mar 6 2021 @ 01:58AM

బంద్‌కు మద్దతుగా కదంతొక్కిన కార్మికులు

స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద బంద్‌లో పాల్గొన్న ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులు

కూర్మన్నపాలేనికి తరలివచ్చిన ఆందోళనకారులు

వామపక్షాలు ర్యాలీ

కూర్మన్నపాలెం, మార్చి 5:  విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకొనేందుకు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేశాయి.  కూర్మన్నపాలెం రహదారిపై వామపక్ష నాయకులు బైఠాయించారు. ప్రజా సంఘాలు, కార్మికులు, తెలుగుదేశం, వైసీపీ శ్రేణులు కూర్మన్నపాలెం చేరుకుని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి తమ సంపూర్ణ సంఘీభావం తెలిపారు. ప్లక్సీలు, ప్లకార్డులు, నినాదాలతో కూడలి మార్మోగింది.  ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివిధ విభాగాలకు చెందిన ఉక్కు ఉద్యోగులు రహదారులపై ట్రాఫిక్‌ నిలిపి తమ నిరసనలను తెలిపారు. ఉక్కు నిర్వాసిత కాలనీల ప్రజలు ర్యాలీలు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు జె.అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, గంధం వెంకటరావు బోసుబాబు, బొడ్డు పైడిరాజు, మస్తానప్ప, విళ్ల రామ్మోహన్‌ కుమార్‌, వరసాల శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement