Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటర్ స్లిప్పుల పంపిణీలో వలంటీర్లు

అనంతపురం: త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం వలంటీర్లను దూరంగా ఉంచాలని ఎస్ఈసీ చెప్పింది. అయితే అనంతపురం జిల్లాలో మాత్రం వలంటీర్లు యథేచ్చగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా ఓటరు స్లిప్పులను వలంటీర్లు పంపిణీ చేస్తూ మీడియా కంటపడ్డారు. కదిరి మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు సైదాపురంలో ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తూ మీడియాకు వలంటీర్లు దొరికిపోయారు. ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న వలంటీర్లను సునీత,మమత, వెంకటపతిగా గుర్తించారు. ఈ వలంటీర్లపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement