Abn logo
Sep 21 2021 @ 00:58AM

వలంటీరు చేతి వాటం

బ్యాంక్‌ ఖాతాల నుంచి డబ్బు మళ్ళింపు

బయోమెట్రిక్‌ ఆధారంగా అక్రమాలు 

యాప్‌ ద్వారా కొనసాగించిన వైనం


కలికిరి, సెప్టెంబరు 20: ప్రభుత్వం కల్పిం చిన రకరకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఔపోసన పట్టిన వలంటీర్లు యధేచ్ఛగా వాటిని ఇతర సౌకర్యాలకు వినియో గిస్తున్నారు. ఇలాంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి జొరబడి లూటీకి పాల్ప డుతున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కలికిరి మండలంలో దాదాపు రూ.లక్ష వరకూ ఇలా ప్రజల ఖాతాల నుంచి తన స్వంత ఖాతాకు నిధులు జమచేసుకున్నట్లు తేలింది. దీనిపై బాధితులు పోలీ సులను ఆశ్రయించారు.కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ పల్లెల్లవారిపల్లెకు చెందిన ఇందిరమ్మ ఖాతా నుంచి రూ.3300 వలంటీరు ఖాతాలోకి జమ చేసుకున్నట్లు కలికిరి పోలీసులకు ఫిర్యాదు అందింది.వలంటీరు నవకుమార్‌పై ఇందిరమ్మ భర్త రాజన్న సోమవారం ఫిర్యాదు చేశారు. కలికిరి ఆంధ్రా బ్యాంకు (ప్రస్తుతం యూనియన్‌ బ్యాంకు)లోని తన భార్య ఖాతా నుంచి వలంటీరు నవకుమార్‌ డబ్బు కొట్టేసినట్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న వివిధ రకాల సంక్షేమ పథకాల కోసమని ఒక యాప్‌లో బయోమెట్రిక్‌ నమోదు చేసుకుని ఆమె ఖాతాలోకి జొరబడినట్లు తేలింది. మరో ఇద్దరి ఖాతాల నుంచి రూ.21 వేలు కూడా నవకుమార్‌ తన ఖాతాకు మళ్ళించాడని చెబుతున్నారు. అయితే తప్పు జరిగిపోయిందని వారిద్దరనీ వేడుకోగా గ్రామస్థుల జోక్యంతో ఫిర్యాదు చేయకుండా డబ్బు వాపసు తీసుకుని మిన్నకుండిపోయారంటున్నారు. వీరు కాకుండా మరో ముగ్గురు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నారు. దాదాపు రూ.లక్ష పైబడి ఇలా ఖాతాల నుంచి వలంటీరు జమ చేసుకున్నట్లు చెబుతున్నారు. సంక్షేమ పథకాల కోసమని నెలకు నాలుగైదు పర్యాయాలు లబ్ధిదారుల బయో మెట్రిక్‌ తీసుకోవడం పరిపాటిగా మారడంతో వలంటీర్లు అడగ్గానే ఎలాంటి సంకోచం లేకుండా ప్రజలు వేలి ముద్రలు వేసేస్తున్నారు. ఏ యాప్‌లో బయోమెట్రిక్‌ ఎందుకు వేయిస్తున్నా డనే విషయం సాధారణంగా చదు వుకున్న వారు కూడా పసిగట్టలేరు. సరిగ్గా దీన్నే నవకుమార్‌ అవ కాశంగా తీసుకు న్నట్లు తెలుస్తోంది. దీనికి సంబం ధించిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని ఎస్‌ఐ సి.లోకేష్‌ రెడ్డి చెప్పారు. ఇలాంటి వ్యవహారా లు ఒక వలంటీరుకే పరిమితమ య్యాయా.. లేక ఒకరి కొకరు కూడబలుక్కుని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారా అనే విషయాలు కూడా విచారణలో తేలాల్సి వుంది.