Abn logo
Oct 23 2021 @ 00:12AM

వలంటీరా.. వైసీపీ కార్యకర్తా?

దీక్షలో కూర్చున్న వలంటీర్‌(పచ్చ చొక్కా వేసుకున్న వ్యక్తి)

భీమవరం జనాగ్రహ దీక్షలో వలంటీర్‌



వీరవాసరం, అక్టోబరు 22 : వలంటీర్లు అంటే ఏమిటి.. పార్టీ కార్యకర్తలా..? ప్రజా సేవకులా..? కొంత మంది వలంటీర్లు మాత్రం పార్టీ కార్యకర్తల్లాగే మసలు కుంటున్నారు.. నాయకుల కనుసన్నల్లో తిరుగుతున్నారు.. ఈ సంఘటనే దానికి ఉదాహరణ.  భీమవరంలో వైసీపీ నిర్వహించిన జనాగ్రహ దీక్షకు వీరవాసరం మండలం కొణితివాడ గ్రామ పరిధిలోని నరసన్నచెరువుపాలెం వలంటీర్‌ వెళ్లి  విధేయతను చాటాడు. శుక్రవారం రెండో రోజు నిర్వహించిన దీక్షలో పార్టీ ప్రతినిధులు, నాయకులతో పాటు నరసన్నచెరువు పాలెంనకు చెందిన వలంటీర్‌ కాండ్రేకుల శ్రీనివాస్‌ దీక్షలో కూర్చున్నాడు.  వైసీపీ కండువా కప్పుకోకపోయినా ఇతర పార్టీలపై నినాదాలు చేస్తూ విమర్శలు కూడా చేశా డని చెబుతున్నారు. ఇది అధికారుల దృష్టికి వెళ్లినా ఏమీ చేయలేని నిస్సహాయతను వ్యక్తం చేశారు. గ్రామ వలంటీర్లు ఎటువంటి రాజకీయ పార్టీల కార్యక్రమంలో పాల్గొనకూడదని నిబంధన ఉన్నప్పటికీ దీనిని విస్మరించి జనాగ్రహ నిరసన దీక్షలో పాల్గొనడం పలు విమర్శలకు దారితీసింది.