Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి‌ అరెస్ట్‌పై నారా లోకేశ్ సంచలన ట్వీట్

అమరావతి: వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి బంధువు, క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డికి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోవ‌డంతో మ‌రిన్ని అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ఖాతా ద్వారా అన్నారు. ద‌స్త‌గిరి వాంగ్మూలం ప్ర‌కారం గొడ్డ‌లిపోటు సూత్ర‌ధారి వైఎస్ అవినాశ్‌రెడ్డి అని ఆయన  అనుమానం వ్యక్తం చేశారు. అవినాశ్‌రెడ్డిని ఈ కేసు నుంచి త‌ప్పించేందుకు వైఎస్ జగన్ సిట్ బృందాన్ని మార్చేశారని, సీబీఐ విచార‌ణ వ‌ద్ద‌న్న‌ారని లోకేశ్ పేర్కొన్నారు. మీ బ్లూ మీడియాలో ఈ ‘వైఎస్సాసుర ర‌క్త‌చ‌రిత్ర’ గురించి ఎప్పుడు రాయిస్తారో? చెప్పాలని నారా లోకేశ్ ప్రశ్నించారు. కాగా వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలం బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే తనతో పాటు కడప నియోజకవర్గంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్‌కు హాజరయ్యారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రమేయం లేదని, ఆయనపై బురదజల్లుతున్నారని రాచమల్లు అంటున్నారు. 

మరోవైపు వివేకానందారెడ్డి హత్య కీలక అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకానందారెడ్డి మాజీ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం దేవిరెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు, లాయర్‌కు వారెంట్ ఇచ్చారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.

Advertisement
Advertisement