Abn logo
Jul 14 2020 @ 12:40PM

చిరంజీవి సినిమాను తిరస్కరించిన వివేక్?

బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ విలన్ పాత్రల్లో రాణిస్తున్న నటుడు వివేక్ ఒబేరాయ్ `లూసిఫర్` తెలుగు రీమేక్‌లో నటించేందుకు నిరాకరించాడట. మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`‌ను మెగాస్టార్ చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. `సాహో` డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాను రూపొందించనున్నాడు. 


మాతృకలో విలన్ పాత్రలో కనిపించిన వివేక్‌నే తెలుగులోకి కూడా తీసుకోవాలని చిత్రబృందం భావించిందట. వివేక్‌తో సంప్రదింపులు కూడా జరిపారట. అయితే మరోసారి అదే పాత్రలో కనిపించేందుకు వివేక్ నిరాకరించాడని సమాచారం. దీంతో ఆ పాత్రకు నటుడు రహమాన్‌ను తీసుకున్నారట. గతంలో మెగాస్టార్ `ఖైదీ నెంబర్ 150`లో విలన్ పాత్రను కూడా వివేక్ తిరస్కరించాడు.

Advertisement
Advertisement
Advertisement