Abn logo
Jul 14 2020 @ 23:34PM

మరోసారి చిరంజీవి చిత్ర ఆఫర్‌ను తిరస్కరించిన నటుడు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న చిత్రం అనంతరం.. మలయాళ చిత్రం ‘లూసిఫర్’ను రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ విషయం ఆయనే స్వయంగా తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్పులు చేసే బాధ్యతలను ‘సాహో’ దర్శకుడు సుజీత్‌కి అప్పజెప్పారు. ఆయన కూడా ఈ సినిమాను చిరుకు, అలాగే తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో నటించే తారాగణం గురించే రోజుకో వార్త మాత్రం హల్‌చల్ చేస్తునే ఉంటుంది.


ఈ చిత్రంలో చిరుకి సోదరి పాత్రలో విజయశాంతి, సుహాసిని, ఖుష్బూ, రోజా.. ఇలా పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా ఎవరు సెలక్ట్ అయ్యారు అనే విషయంలో చిత్రయూనిట్ స్పందిస్తేగానీ తెలియదు. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రకు జగపతిబాబును సెలక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో, ‘లూసిఫర్’లో చేసిన వివేక్ ఒబెరాయ్‌నే విలన్‌గా సంప్రదించారని, ప్రస్తుతం ఆయన బిజీ షెడ్యూల్‌లో ఉండటం వల్ల.. ఈ ఆఫర్‌ను తిరస్కరించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరు చిత్రాన్ని వివేక్ ఒబెరాయ్ వదిలేయడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ‘ఖైదీ నెంబర్ 150’ కోసం కూడా ముందు వివేక్‌నే విలన్‌గా అనుకున్నారు. కానీ అప్పుడు కూడా ఆయన తిరస్కరించినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఆయన ఈ చిత్రాన్ని కాదనుకోవడంతో.. ఒక్కసారిగా ఆయన వార్తల్లో హైలెట్ అవుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement