ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టుకి వెళ్తామని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు. రాజకీయాలు ముఖ్యం కాదని.. జగన్ సింగిల్‌గా ఉన్నప్పుడే ఎన్నికలకి భయపడలేదని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు.