Abn logo
Jul 24 2021 @ 09:20AM

అయిన వారికి అలా .. కాని వారికి ఇలా..!

  • జలమండలి విధానంపై జనం ఆవేదన


హైదరాబాద్‌ సిటీ/నార్సింగ్‌ : హిమాయత్‌సాగర్‌ జలాశయం చూడాలా? అయితే మీకు అధికారులు అయినా తెలుసుండాలి లేదా ఖద్దరు చొక్కా వేసుకుని ఉండాలి... నాకు అవి ఏమీ లేవు అందుకే నన్ను జలాశయం చూడడానికి పంపడంలేదని ఓ నగర పౌరుడి ఆవేదన. అదే క్రమంలో కొంత మంది జలాశయం చూడడం కోసం ఏకంగా గేట్ల వద్దకు వెళుతున్నారని ఓ వ్యక్తి రెండు ఫొటోలను విడుదల చేశారు.  ఓ కుటుంబం పిల్లలతో కలిసి హిమాయత్‌సాగర్‌ గేట్ల వద్ద ట్రాక్‌పై తిరుగుతున్నారు. ఏ మాత్రం కాలు జారినా జలాశయంలోకే మరి. ఇంకో పక్క జలాశయం చూసేందుకు తమను వదలడం లేదని, గేట్లు మూసివేశారని ప్రధాన గేట్ల వద్ద జనం వేచి ఉన్న మరో ఫొటోను మరో పౌరుడు ‘ఆంధ్రజ్యోతి’కి పంపించారు.  మరి హిమాయత్‌సాగర్‌ జలాశయం కావచ్చు. గండిపేట జలాశయం కావచ్చు తిలకించడానికి ఒక విధానం జలమండలి అధికారులకు లేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు మేల్కొంటారో లేదో చూడాలి.