Abn logo
May 30 2020 @ 09:54AM

జర్మనీ నుంచి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ నేడు తిరిగి రాక

న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్ వల్ల జర్మనీలో చిక్కుకుపోయిన చెస్ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకు శనివారం తిరిగి స్వదేశానికి రానున్నారు. మార్చి 1వతేదీన జరిగిన బుండేస్లిగా చెస్ టోర్నమెంటులో పాల్గొనేందుకు జర్మనీ వెళ్లిన విశ్వనాథన్ ఆనంద్ లాక్ డౌన్ వల్ల అక్కడే చిక్కుకు పోయారు. విమాన సర్వీసుల రద్దుతో ఇన్నాళ్లు జర్మనీలోని ఫ్లాటులో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న ఆనంద్ ఎట్టకేలకు శనివారం స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు ఆయన సతీమణి అరుణా ఆనంద్ చెప్పారు. విశ్వనాథన్ ఆనంద్ ప్రయాణిస్తున్న విమానం శనివారం మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుందని అరుణా చెప్పారు. ఎయిర్ ఇండియా విమానంలో జర్మనీ నుంచి వస్తున్న విశ్వనాథన్ ఆనంద్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉంటారని అరుణ వివరించారు. 

Advertisement
Advertisement
Advertisement