Abn logo
Jul 13 2020 @ 17:27PM

విషాదం..తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పసికందును చూసి..

విశాఖ: సింహాచలం సింహగిరిపై గిరిజన గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువకుడు శ్రావణ్ కుమార్(25) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు రోజుల క్రితం భార్య  అంబిక (20) మృతి చెందింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి చెందడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ దంపతులకు ఓ పసిపాప ఉంది. ఆ పసికందు తల్లిదండ్రులను కోల్పవడంతో ఆ గ్రామంలో విషాఛాయలు అలుముకున్నాయి. ఆ పసికందును చూసిన వారంతా కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement
Advertisement