Abn logo
Dec 2 2020 @ 11:29AM

విశాఖ జీవీఎంసీ వద్ద సీపీఎం నిరసన

విశాఖపట్నం: న్సిపల్ పన్నులు పెంచడాన్ని నిరసిస్తూ జీవిఎంసీ గేటు ముందు బుధవారం ఉదయం సీపీఎం నేతలు  నిరసనకు దిగారు. పట్టణ సంస్కరణల పేరుతో ప్రజలపై భారం వేయొద్దంటూ నినాదాలు చేపట్టారు. ఆస్తి పన్ను పెంపు జీఓ కాపీని దగ్దం చేస్తూ నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా సీపీఎం నేత కుమార్ ఆస్తి మార్కెట్ విలువ ఆధారంగా పన్నులు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇది ప్రజలపై పెను భారం‌ మోపుతుందన్నారు. తక్షణమే ఉపసంహరించుకోవాలి లేదంటే ఉద్యమిస్తామని కుమార్ హెచ్చరించారు.

Advertisement
Advertisement
Advertisement