Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏయూ క్యాంపస్‌లో నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం

విశాఖపట్నం: విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి పాల్గొని నాస్కామ్ సీఓఈని సందర్శించారు. అటు ఢిల్లీ నుంచి వర్చ్యువల్ విధానంలో కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి ఔత్సాహిక స్టార్ట్అప్స్‌కు  కేంద్రం శిక్షణ ఇవ్వనుంది.  ఆంధ్రా యూనివర్సిటీలో సుమారు 3,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాస్కామ్ సీఓఈని ఏర్పాటు చేశారు. అన్ని పరికరాలతో కూడిన ల్యాబ్, 3–డీ ప్రింటర్స్, పీసీబీ ప్రొటోటైప్‌ మెషీన్స్, సోల్డరింగ్‌ స్టేషన్లు, హైఎండ్‌ ఆసిలోస్కోప్స్‌తో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనున్నారు. 

Advertisement
Advertisement