Abn logo
Dec 5 2020 @ 07:24AM

మద్యం మత్తులో డ్రైవర్ల మధ్య ఘర్షణ

విశాఖపట్నం: ఇద్దరు డ్రైవర్ల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. విశాఖ కూర్మన్నపాలెంలో ఇద్దరు లారీ డ్రైవర్ల మధ్య  వివాదం చోటు చేసుకుంది. మద్యం మత్తుల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.  డ్రైవర్ జ్యోతుల మల్లికార్జునరావుపై మరో డ్రైవర్ దుర్గాప్రసాద్ కత్తితో దాడి చేశాడు. టోల్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే దువ్వాడ పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ దుర్గాప్రసాదును అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement