విశాఖపట్నం: ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ప్రియాంకను చూసేందుకు బంధువులు, స్నేహితులు కేజీహెచ్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రియాంకపై దాడి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నామన్నారు. ఆమె పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని తెలిపారు. ప్రియాంక చాలా మంచి అమ్మాయని.. దాడి చేసిన శ్రీకాంత్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మళ్లీ, మళ్లీ ఇటువంటి ఘటనలు జరగకుండా శ్రీకాంత్‌ని శిక్షించాలని బంధువులు, స్నేహితులు చెబుతున్నారు.