Abn logo
Oct 24 2020 @ 05:07AM

బంధనల అమలులో ఆదర్శంగా ఉండండి

విశాఖ రేంజ్‌ డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు

రావికమతం, కొత్తకోట పోలీసు స్టేషన్ల సందర్శన 


రావికమతం, అక్టోబరు 23: కొవిడ్‌ నిబంధనల అమలులో పోలీసులు ఆదర్శంగా ఉండాలని విశాఖ రేంజ్‌ డీఐజీ వేళ్ల కాళిదాసు వెంకట రంగారావు సూచించారు. రావికమతం, కొత్తకోట పోలీసు స్టేషన్లను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కొవిడ్‌ కేసులు, సిబ్బంది ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు.


ఒక్క హోంగార్డుకు తప్పితే సిబ్బందిలో ఎవరికీ కరోనా సోకలేదని కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి డీఐజీకి వివరించారు. పోలీసు సిబ్బంది కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించి అందరికీ స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. అంతకుముందు స్టేషన్‌లో కంప్యూటర్‌, లాకప్‌ రూమ్‌, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విధి నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో విశాఖ రూరల్‌ ఎస్పీ బి.కృష్ణారావు, నర్సీపట్నం ఏఎస్పీ తుహీన్‌సిన్హా, సీఐ లక్ష్మణమూర్తి, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌, రాము పాల్గొన్నారు.

Advertisement
Advertisement