Abn logo
Dec 2 2020 @ 14:36PM

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి పరిస్థితి విషమం

విశాఖ: నగరంలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై కత్తితో దాడి చేశాడు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ప్రియాంక మెడపై కత్తితో శ్రీకాంత్ అనే యువకుడు దాడి చేశాడు. ప్రేమలోనే ఉన్నప్పటికీ.. ఆమెపై అనుమానంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉందని కేజీహెచ్ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. ప్రియాంక చాలా మంచి అమ్మాయని, ఈ ఘటన తమను కలిచివేసిందని స్థానికులు చెబుతున్నారు. అతని ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఈ దారుణానికి పాల్పడిన శ్రీకాంత్‌ను సమాజంలో తిరగనీయకుండా కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


అయితే ప్రియాంక మరో యువకుడితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో శ్రీకాంత్ దాడి చేసినట్టుగా సమాచారం. దాడి అనంతరం ప్రియాంక ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో విషయం చెప్పాడు. వారితో మాట్లాడుతూనే అదే కత్తితో తనను తాను గాయపరచుకున్నాడు. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు షాకయ్యారు. వెంటనే తేరుకున్నస్థానికులు.. వారిద్దరిని కేజీహెచ్‌కు తరలించారు. 

Advertisement
Advertisement
Advertisement