విశాఖ: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ప్రియాంక మరో యువకుడితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో శ్రీకాంత్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దాడి అనంతరం ప్రియాంక ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో విషయం చెప్పాడు. వారితో మాట్లాడుతూనే అదే కత్తితో తనను తాను గాయపరచుకున్నాడు. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు షాకయ్యారు. వెంటనే తేరుకున్నస్థానికులు.. వారిద్దరిని కేజీహెచ్‌కు తరలించారు. ప్రియాంక ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమెను శ్రీకాంత్ ప్రేమిస్తున్నట్టుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.