Abn logo
Jul 12 2020 @ 05:09AM

వైద్యానికి వైరస్‌

వైద్య, ఆరోగ్య శాఖపై కరోనా పంజా

ఇప్పటికే 11 మంది వైరస్‌ నిర్ధారణ

ఉద్యోగులంతా క్వారంటైన్‌కువెళ్లడంతో ఖాళీగా కార్యాలయం

జనరల్‌ ఆసుపత్రినీవెంటాడుతున్న కరోనా

డాక్టర్‌తో పాటు ముగ్గురుసిబ్బందికి పాజిటివ్‌

ఎస్వీఎస్‌లోనూ నలుగురువైద్య విద్యార్థులకు వైరస్‌


కరోనా ప్రజలనే కాదు, వైద్యులనూ వదలడం లేదు.. ఎవరి నుంచి ఎలా సోకుతుందో తెలియడం లేదు కానీ, మొత్తానికి డాక్టర్లతో పాటు సిబ్బంది కూడా దీని బారిన పడుతున్నారు.. బాధితులకు చికిత్స చేసే సమయంలో పీపీఈ కిట్లు ధరింనిచా, వైరస్‌ సోకుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.. మహబూబ్‌నగర్‌ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పని చేసే వైద్యాధికారులు, వైద్య సిబ్బంది 11 మంది, జనరల్‌ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నలుగురు, ఎస్వీఎస్‌ ఆసుపత్రిలో నలుగురు వైద్య విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారు.. దాదాపు 23 మందికి పాజిటివ్‌ రాగా, వీరితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బాధితులుగా మిగులుతున్నారు..


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), జూలై 11 : కరోనా వైరస్‌ మహ బూబ్‌నగర్‌ జిల్లాను వదలడం లేదు. వైరస్‌ మొదలైన ప్రారంభంలో జడ్చర్లకు చెందిన వైద్య సహాయకుడికి పాజిటివ్‌ వచ్చింది. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీకి చెందిన ఓ డాటా ఎంట్రీ ఆపరే టర్‌కు వైరస్‌ సోకింది. వీరిద్దరు ఏయిర్‌ పోర్టులో విధులు నిర్వహించే క్రమంలో వైరస్‌ అంటుకుంది. ఆ తర్వాత రెండు నెలల పాటు ఏ ఒ క్కరిని తాకలేదు. రెండో దశలో లాక్‌డౌన్‌ సడలింపు పూర్తయిన తర్వా త ఒక్కసారిగా వైరస్‌ జిల్లాపై పంజా విరిసింది. జూన్‌ నెల చివరి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్కరికిగా వైరస్‌ బారిన పడుతున్నారు.


ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలోనే ఇప్పటి వరకు 11 మందికి పాజిటివ్‌ వ చ్చింది. ఇందులో వైద్య ఆరోగ్య శాఖలో పని చేసే ఓ ప్రోగ్రాం ఆఫీస ర్‌కు సోకింది. దీంతో అతని కుటుంబ సభ్యులు మొత్తం ముగ్గురికి కూ డా పాజిటివవ్‌ వచ్చింది. అతని వెంట ఉండే మరో ఎపిడమాలజిస్టు కు తాజాగా పాజిటివ్‌ వచ్చింది. మరో ప్రోగ్రాం ఆఫీసర్‌కు కరోనా అం టుకుంది. ఆ అధికారి వెంట తిరిగే ఓ హెల్త్‌ ఎడ్యుకేటర్‌కు పాజిటివ్‌ వచ్చింది. ఎంసీహెచ్‌లో పని చేసే ఓ ఏఎన్‌ఎం, భూత్పూర్‌ పీహెచ్‌సీ పరిధిలో పని చేసే ఓ ఏఎన్‌ఎం, 104 విభాగంలో పని చేసే ఓ ల్యాబ్‌ టెక్నిషీయన్‌కు, మలేరియా విభాగంలో పని చేసే మరో ల్యాబ్‌ టె క్నిషీయన్‌, డీఎంఅండ్‌హెచ్‌వోకు సీసీగా పని చేసిన ఓ ఉద్యోగికి పా జిటివ్‌ వచ్చింది.


కార్యాలయం ఖాళీ 

డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో పని చేసే ఇ ద్దరు ప్రోగ్రాం ఆఫీసర్లు, మిగతా వైద్య సిబ్బందికి క రోనా రావడంతో మిగతా వారు అంతా క్వారంటైన్‌లో కి వెళ్లిపోయారు. దీంతో కార్యాలయం ఖాళీ అయ్యిం ది. పరిపాలన విభాగంలో ఉన్న వారు ఆఫీసుకు రా వడం లేదు. వచ్చినా సంతకాలు చేసి వెళ్లిపోతున్నా రు. పరిపాలన అధికారి కూడా హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో వారు కూడా విధుల కు సక్రమంగా హాజరుకావడం లేదు. ఇక డీఎంఅం డ్‌హెచ్‌వో ఒక్కరే ఆఫీసుకు వచ్చి కూర్చొని పనులు చేసుకొని వెళుతున్నారు.


జనరల్‌ ఆసుపత్రిలో..

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఓ పాజిటివ్‌ వ్యక్తికి చికిత్స చేసిన ఓ గైనిక్‌ వైద్యురాలికి ఇటీవల వైరస్‌ సోకింది. ఆమెతో పాటు మరో ఇద్దరు డెర్మటాలజి విభాగం డాక్టర్లకు వైరస్‌ అంటుకుంది. ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్‌, ఒక మేల్‌ నర్సు,  రేడియాలజి విభాగంలో పని చేసే ఓ ఎక్స్‌రే టెక్నిషీయన్‌కు పాజిటివ్‌ వచ్చింది.


ఎస్వీఎస్‌ ఆసుపత్రిలో..

ఎస్వీఎస్‌ ఆసుపత్రికి కూడా కరోనా అనుమానిత లక్షణాలున్న వారు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలోని నలుగురు వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. వీరితో పాటు మరో ఇద్దరు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది.

Advertisement
Advertisement