Abn logo
Sep 11 2020 @ 05:16AM

కొనసాగుతున్న వైరస్‌ ఉధృతి

Kaakateeya

ఉమ్మడి జిల్లాలో 1481 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ, ఇద్దరి మృతి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగటం లేదు. ఉమ్మడి జిల్లాలో గురువారం 1,481 మంది కరోనా బారిన పడినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 792 మందికి పాజిటివ్‌ రాగా, ఒకరు మృతి చెందారు. అలాగే మేడ్చల్‌ జిల్లాలో 642 మందికి పాజిటివ్‌ రాగా, ఇందులో ఒకరు మృతిచెందారు. వికారాబాద్‌ జిల్లాలో 47మందికి పాజిటివ్‌గా తేలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 63,852కు చేరుకుంది. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో గురువారం 319 మందికి కరోనా చేయగా 52 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో షాద్‌నగర్‌లో 6, ఫరూఖ్‌నగర్‌ మండలంలో 25, కేశంపేట మండలంలో 10 మంది ఉన్నారు. మిగతా 11మంది ఇతర మండలాలకు చెందినవారున్నారు.


చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 44 మందికి పరీక్షలు చేయగా ఇందులో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో 31 మందికి పరీక్షలు చేయగా 4, శంకర్‌పల్లి మండలంలో 70 మందికిగాను 2, మొయినాబాద్‌ మండలంలో 35 మందికిగాను 4, షాబాద్‌ మండలంలో 67మందికిగాను 10మందికి పాజిటివ్‌ వచ్చింది.


కందుకూరులో...

కందుకూరు / శంషాబాద్‌ : కందుకూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 54మందికి కరోనా పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో మాలగూడూరుకు చెందిన ఇద్దరు, అన్నోజిగూడకు చెందిన మరో ఇద్దరు, కందుకూరు, చైతన్యపురికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో 84 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌ వచ్చింది.


ఉపాధ్యాయుడికి కరోనా...

బొంరాస్‌పేట్‌: బొంరా్‌సపేట్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తోటి ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నుంచి రాకపోకలు కొనసాగిస్తూ పాఠశాలలో విధులు నిర్వహించే ఓ ఉపాధ్యాయుడు గురువారం షాద్‌నగర్‌లో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. ఈనెల 1 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ప్రారంభం కావడంతో సదరు ఉపాధ్యాయుడితోపాటు మరి కొంతమంది ఉపాధ్యాయులు కారులో రాకపోకలు కొనసాగించేవారు. దీంతో శుక్రవారం పాఠశాలలో శానిటైజేషన్‌ నిర్వహించి మిగతా ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తామని ప్రధానోపాధ్యాయుడు పాపిరెడ్డి తెలిపారు. 


వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి : వికారాబాద్‌ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గురువారం వికారాబాద్‌లో 16, కొడంగల్‌లో 5, యాలాలలో 4, తాండూరులో 3, కులకచర్లలో 3, పెద్దేముల్‌లో 3, మోమిన్‌పేటలో 3, పరిగిలో 3, దౌల్తాబాద్‌లో 2, పూడూరు, మర్పల్లి, బషీరాబాద్‌, బొంరా్‌సపేట మండలాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


తరిగోపులలో ఒకరికి కరోనా

ధారూరు: ధారూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇందులో తరిగోపుల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి రాజు తెలిపారు. 

Advertisement
Advertisement