Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద బాధితల కోసం విరాళాల సేకరణ

కావలి, నవంబరు 27: జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు కావలి జేబీ డిగ్రీ కళాశాల ఫైనలియర్‌ విద్యార్థులు శనివారం కావలిలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. స్థానిక జేబీ కళాశాల నుంచి పట్టణంలోని అన్ని జూనియర్‌, డిగ్రీ కళాశాలలతో పాటు కావలి ట్రంకురోడ్డులో కూడా విరాళాలు సేకరించారు. సేకరించిన విరాళాలను నెల్లూరు పరిసరాలలో వరద ముంపునకు గురైన ప్రాంతాలకు తామే వెళ్లి స్వయంగా గుర్తించి సరుకులను కొనుగోలు చేసి పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు షేక్‌.ఫయాజ్‌, ఫిరోజ్‌, గోపీకృష్ణ, మల్లికార్జున, ప్రవీణ్‌, గజేంద్ర, వంశీ, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement