Abn logo
Jan 18 2021 @ 00:14AM

ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జిల్లా చైర్మన్‌గా ‘వినుకొండ’

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 17 : ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వ ఉద్యోగుల సమాఖ్య జిల్లా చైర్మన్‌గా వినుకొండ రా జారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒంగోలులోని పాత రిమ్స్‌లో ఆదివారం జరిగిన విలేఖరుల సమా వేశంలో రాష్ట్ర కోశాధికారి అంబటి వెంకటస్వామి, కో చై ర్మన్‌ భాస్కరరెడ్డి, అదనపు సెక్రటరీ దేవపాల్‌లు మా ట్లాడారు. రాష్ట్ర చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి నేతృత్వం లో సమాఖ్యను బలోపేతం చేస్తామన్నారు.   అనంత రం జిల్లా చైర్మన్‌గా ఎన్నికైన రాజారావును ఘనంగా స త్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌కే.సూతర్‌ బాషా, శివశంకర్‌, జీవీవీ.రాఘవరెడ్డి, కె.ఈశ్వరరెడ్డి, ఎం. అమర్‌, డి.మధు, జక్కా సాయిబాబు, ప్రసాద్‌, డి.విజ యలక్ష్మి, ఎండ్లూరి చిట్టిబాబు, వినోద్‌, జ్యోత్స్న, శిరీష, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement