Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోడు భూముల గ్రామాలను గుర్తించాలి

జన్నారం, నవంబరు 27: పోడు భూముల గ్రామాలను గుర్తించి జాబితాలో చేర్చాలని  శనివారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఎఫ్‌డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు సీపీఎం పార్టీ కార్యాలయం నుం చి ఎఫ్‌డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిం చారు. పార్టీ మండల కార్యదర్శి కనికరం అశోక్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సాగుదారుల హక్కు పత్రాల కోసం షెడ్యూలు ప్రకటించిందని, కానీ జిల్లాలోని కొన్ని గ్రామా లను పోడు గ్రామాలుగా గుర్తించకుండా అధికా రులు అలసత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు.  దండేపల్లి మండలం మామిడిపల్లి, లింగాపూర్‌, దమ్మన్నపేట, మాకులపేట, కోయపోచగూడ, గుడిరేవు, తాళ్లపేట, బిక్కినగూడెం, జన్నారం మండలంలోని మ హ్మదాబాద్‌, తపా లపూర్‌, సింగరా యిపేట, తిమ్మా పూర్‌, రాంపూర్‌ గ్రామాలను పోడు గ్రామాలుగా గుర్తిం చి జాబితాలో చేర్చాలన్నారు. లేక పోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆం దోళనలు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎఫ్‌డీవో కార్యాలయం సూపరిం టెండెంట్‌కు వినతి పత్రం అందించారు.  కార్యక్ర మంలో సీపీఎం జిల్ల కమిటీ సభ్యులు దుంపల రంజిత్‌కుమార్‌, నాయకులు రాజన్న, రాజమౌళి, అంజన్న, రాజు, లక్ష్మీ, పోశవ్వ, అంజినాగ్‌, రమేష్‌, భూమయ్య, రమేష్‌, చిన్నభీమయ్య, పోడు రైతులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement