Abn logo
Sep 17 2020 @ 07:45AM

గ్రామస్థుల విరాళాలతో వంతెన నిర్మాణం..బుధౌల్ గ్రామస్థుల ఆదర్శం

Kaakateeya

గయ (బీహార్): ‘‘ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూసి మోసపోకుమా’’ అన్నాడో ఓ సినీ కవి. ఆ మాటలను అక్షరాలా నిజం చేసి చూపించారు బీహార్ రాష్ట్రంలోని బుధౌల్ గ్రామ ప్రజలు...గయ జిల్లాలోని బుధౌల్ గ్రామ సమీపంలోని ఓ వాగుపై వంతెన నిర్మాణం 30 ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. అసంపూర్తిగా ఉన్న వంతెనను పూర్తి చేయాలని బుధౌల్ గ్రామస్థులు బీహార్ ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. అంతే దీంతో స్థానిక సోషల్ వర్కర్ చిత్రరంజన్ కుమార్ బుధౌల్ గ్రామస్థులతో కలిసి పంచాయతీ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా తామే మెటీరియల్ ను సమకూర్చుకొని శ్రమదానంతో వంతెన నిర్మాణం పూర్తి చేసుకోవాలని నిర్ణయించారు. 

వంతెన నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ ను గ్రామస్థులే విరాళాలుగా అందించారు. మెటీరియల్ ఇవ్వలేని పేదలు శ్రమదానం చేసేందుకు ముందుకు వచ్చారు. అంతే బుధౌల్ గ్రామ వాగుపై వంతెన నిర్మాణం చురుకుగా సాగుతోంది. ఈ వంతెన నిర్మాణం వల్ల 15 కిలోమీటర్ల దూరం కిలోమీటరుకు తగ్గిందని కుమార్ చెప్పారు. 30 ఏళ్లుగా సర్కారు సాయం కోసం ఎదురు చూసిన  బుధౌల్ గ్రామస్థులు విసిగిపోయి తమ విరాళాలతో వంతెన నిర్మాణం పూర్తి చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. 

Advertisement
Advertisement
Advertisement