Abn logo
Oct 14 2021 @ 00:28AM

లైన్‌మెన్‌పై గ్రామస్థుల దాడి

లింగంపేట, అక్టోబరు 12: మండలంలోని భవానీపేటలోని సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణపై గ్రామానికి చెందిన కొం దరు దాడి చేసి కొట్టారని బుధవారం లైన్‌మెన్‌ సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్యనారాయణకు లింగంపేట మండలంలో జూనియర్‌ లైన్‌మెన్‌గా ఉద్యోగం వచ్చింది. దీంతో అధికారులు ఆయనను తాత్కాలికంగా భవానీపేట సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా నియమించా రు. మంగళవారం రాత్రి భవానీపేటకు చెందిన దొబ్బల నారాయణ ఇంట్లో కరెంటు రావడం లేదని సబ్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఎల్‌సీ తీసు కుని సర్వీస్‌ వైరు బాగు చేసినప్పటికీ కరెంటు రాలేదు. దీంతో సబ్‌స్టేషన్‌కు వచ్చి తనిఖీ చేస్తుండగా రాత్రి 8:30 ప్రాంతంలో ఉప సర్పంచ్‌ కుమార్‌, రమేష్‌, మల్లేష్‌, రాజులతో పాటు కొందరు వచ్చి దాడి చేసి కొట్టారని తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.