Abn logo
Jun 3 2020 @ 05:17AM

బాలికపై గ్రామ వలంటీర్‌ అత్యాచారయత్నం

శింగనమల, జూన్‌ 2: మండలంలోని చిన్న మట్లగొంది గ్రామానికి చెందిన గ్రామ వలంటీర్‌ సంతోష్‌ అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చి న్నమట్లగొంది గ్రామానికి చెందిన కొత్తరూముల గ్రామ వలంటీర్‌ సంతోష్‌ అదే కాలనీకి చెందిన ఓ బాలిక ఇంటిదగ్గరకు వెళ్లాడు. ‘మీ తల్లితండ్రులు ఎక్కడికి వెళ్లారు..’ అని బాలికను అడిగాడు. ‘మా అమ్మానాన్నలు ఉపాధి పనులకు వెళ్లారు..’ అని బాలిక సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా వలంటీర్‌ ఇంట్లోకి చొరబడ్డాడు.


వెంటనే బాలికను బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో చట్టుపక్కల నివాసం ఉంటున్న వారు వ చ్చారు. గమనించిన వలంటీర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక తల్లితండ్రులు శింగనమల పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ రాంభూపాల్‌ వలంటీర్‌ సంతో్‌షను అదుపులోకి తీసుకున్నారు. ఫొక్సోయాక్ట్‌ మేరకు అత్యాచారయ త్నం, లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. కాగా గ్రామ వలంటీర్‌ చేసిన నిర్వాకంపై ఎంపీడీఓ శ్రీనివాసులును వివరణ కోరగా వలంటీర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈవిషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు తెలియచేసి తక్షణమే విధుల నుంచి తొలగిస్తామన్నారు.

Advertisement
Advertisement
Advertisement