Abn logo
Oct 7 2020 @ 01:10AM

రోడ్లన్నీ ఛిద్రం

Kaakateeya

వర్షాల ధాటికి బీటీ లేచిపోయిన గ్రామీణ రోడ్లు

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

పట్టించుకోని పాలకులు


చౌదరిగూడ: వారం పది రోజుల కిందటి వరకు తరచూ కురి సిన భారీ వర్షాల కారణంగా చౌదరిగూడ మండల పరిధిలోని పలు గ్రామాల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రోడ్లు వరదకు కొట్టుకుపోయి ఎక్కడికక్కడ బీటీ లేచి ఛిద్రం అయ్యాయి. జిల్లేడ్‌ సమీపంలోని చెరువులో నుంచి వచ్చిన నీరు రోడ్డుపైకి పారడంతో గుంతలమయంగా మారింది. కొన్ని రోజుల పాటు నీటి ప్రవాహంతో రోడ్డు పక్కనున్న కాలువ ప్రమాదభరితంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేగిరెడ్డిఘనాపూర్‌ సమీపంలోని పెద్దవాగు ప్రవాహంతో రోడ్డుపై పెద్ద గోతులు ఏర్పడ్డాయి. గుంజల్‌పహాడ్‌ స మీపంలో వరదకు రోడ్డు కోతకు గురైంది. లాల్‌పహాడ్‌-జాకారం మీ దుగా మహబూబ్‌నగర్‌కు, వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలంలోని పలు గ్రామాలకు రోజూ వందల వాహనాలు వెళ్తుంటాయి. పాడైన రోడ్లపై రాత్రి సమయాల్లో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నా పాలకులు పట్టించుకోవడంలేదు. 


వాహనదారులకు తప్పని తిప్పలు

గుంతల రోడ్లతో ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లకు తిప్పలు తప్పడం లేదు. చేగిరెడ్డిఘనాపూర్‌ నుంచి గాలిగూడ వరకు గ ల 7కి.మీ బీటీ రోడు,్డ జాకారం-మల్కపహా డ్‌ వరకు 3కి.మీ బీటీ రోడ్డు, దానితో పాటు జాకారం-చలివేంద్రంపల్లి మఽధ్యనున్న 5కి.మీ రోడ్డు పూ ర్తిగా కంకర తేలి గోతులు పడి ద్విచక్ర వాహనదారులు సైతం వెళ్లలేని పరిస్థితి దాపురించింది. సాహసించి వెళ్లినా టైర్‌ పంక్చర్‌ అ వడం, వాహనాలు పాడవడం జరుగుతోంది. గాలిగూడ, చలివేంద్రంపల్లి గ్రామాలకు అంబులెన్‌ ్స రావలన్నా ఇబ్బందులు ఎదుర్కో వాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పద్మారం, ఎల్కగూ డ గ్రామాలకు రోడ్డు మంజూరై ఏడాది గడుస్తున్నా అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు పూర్తి కావడంలేదు. 

Advertisement
Advertisement