Abn logo
Jul 15 2020 @ 10:41AM

పోలీసులను చంపమని దూబే ఆదేశించారు...గ్యాంగ్‌స్టర్ అనుచరుడి వెల్లడి

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే సన్నిహిత అనుచరుడు శశికాంత్ పాండే పోలీసుల ఇంటరాగేషన్‌లో సంచలన విషయాలు వెల్లడించారు. బిక్రూ గ్రామంలో ఈ నెల 3వతేదీన తమ గ్యాంగ్ లీడర్ వికాస్ దూబే ఆదేశంతో తాను పోలీసులపై కాల్పులు ప్రారంభించానని శశికాంత్ పాండే చెప్పారు. వచ్చిన పోలీసులను చంపమని పోలీసుస్టేషన్ నుంచి సమాచారం వచ్చిందని, పోలీసులను చంపాలని దూబే ఆదేశించడంతోనే తాను కాల్పులు జరిపానని శశికాంత్ పోలీసుల ముందు చెప్పారు. వికాస్ దూబే మేనమామ ప్రేమ్ ప్రకాష్ కుమారుడైన శశికాంత్ పాండేను పోలీసులు అరెస్టు చేశారు.


శశికాంత్ పాండే నుంచి రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వికాస్ దూబే,అమర్ దూబే, ప్రభాత్ మిశ్రా, బవువా, అతుల్ దూబేలతో కలిసి తాను పోలీసులపై కాల్పులు జరిపినట్లు శశికాంత్ అంగీకరించారు.శశికాంత్ ను కాన్పూర్ లోని తిరహా మేళా వద్ద అరెస్టు చేశారు. ఇతనిపై రూ.50వేల రివార్డు ఉంది. శశికాంత్ ఇచ్చిన సమాచారం మేర తాము అతని ఇంట్లో నుంచి రైఫిల్, 20 తూటాలను స్వాధీనం చేసుకున్నామని కాన్పూర్ అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. వికాస్ దూబే ఇంట్లో పోలీసుల నుంచి లాక్కున్న తుపాకులు దొరికాయని డీజీపీ చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement