Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబు జోక్యంతో సద్దుమణిగిన బెజవాడ తగువు

విజయవాడ: బెజవాడ రాజకీయాల్లో సంచలనంగా మారిన తెలుగు తమ్ముళ్ల విభేదాలు సద్దుమణిగాయి. అధినేత జోక్యంతో వివాదం చల్లారింది. శనివారం ఉదయం నుంచి హాట్ హాట్‌గా సాగిన బెజవాడ రాజకీయాలను చంద్రబాబు కట్టడి చేశారు. టెలికాన్ఫరెన్స్‌లో అందరితో మాట్లాడిన చంద్రబాబు... అసంతృప్త నేతలను సముదాయించినట్టు తెలుస్తోంది. అధినేత ఆదేశాలతో బెజవాడ నేతలతో అచ్చెన్నాయుడు, టి.డి. జనార్దన్‌, వర్ల రామయ్య చర్చించారు. విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆదివారం చంద్రబాబు పర్యటనలో అందరూ పాల్గొని శ్వేతను గెలిపించేందుకు కృషిచేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.   

Advertisement
Advertisement