Abn logo
Mar 6 2021 @ 12:11PM

కేశినేని కావాలా.. అందరూ కావాలా.. చంద్రబాబుకు బొండా ఉమా అల్టిమేటం

విజయవాడ: ఎంపీ కేశినేని నాని ప్రవర్తన సరిగాలేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేస్తోంది తామని, పదవుల కోసం పనిచేస్తోంది కేశినేని నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని కావాలో.. అందరూ కావాలో చంద్రబాబు తేల్చుకోవాలంటూ బొండా ఉమా అల్టిమేటం జారీ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజారాజ్యంలో ఇదే తరహాలో వ్యవహరించి బయటకు గెంటించుకున్నారన్నారు. విజయవాడ టీడీపీ తానే అధిష్ఠానమని కేశినేని మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. తన కూతురుని మేయర్ చేయడం కోసం ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపారన్నారు. కులాలమధ్య, పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. వర్గాలను,విభేదాలను కేశినేని ప్రోత్సహిస్తున్నాడన్నారు. నిజంగా బెజవాడ పార్లమెంట్‌లో కేశినేనికి సత్తా ఉంటే... రాజీనామా చేసి... ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలన్నారు. టీడీపీ సింబల్, చంద్రబాబును చూసి నీకు ఓట్లు వేశారన్నారు. నాని ఇండిపెండెంట్‌గా గెలిచి చూపిస్తే... కట్టుబట్టలతో విజయవాడ వదిలివెళ్లిపోతానని సవాల్ చేశారు. నాని ముఖ్యం అనుకుంటే... తాము రేపు జరుగబోయే చంద్రబాబు టూర్‌కు దూరంగా ఉంటామని హెచ్చరించారు. 


ఇవి కూడా చదవండిImage Caption

బెజవాడ టీడీపీలో విభేదాలు..పార్టీ ఎవరి జాగీరు కాదు.. కేశినేనిపై బెజవాడ నేతలు సీరియస్ఆ రోజే చెప్పుతో కొట్టేవాడిని.. కేశినేనిపై బుద్దా తీవ్ర వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Advertisement