Advertisement
Advertisement
Abn logo
Advertisement

AP: రాజధానిపై సీఎం జగన్ డొంకతిరుగుడు: బాలకోటయ్య

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని అసెంబ్లీ సాక్షిగా ఆమోదించి.. ఇప్పుడు డొంకతిరుగుడు మాటలు చెప్పడం దుర్మార్గమని బహుజన జేఏసీ కన్వీనర్ పోతుల బాలకోటయ్య విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకుంటున్నామని చెప్పి.. సమగ్రమైన బిల్లు తీసుకొస్తామని చెప్పడం సహేతకమైందన్నారు. ఆంద్రప్రదేశ్‌కు రాజధాని లేని రాష్ట్రంగా ఎంతకాలం ఉంచుతారని ప్రశ్నించారు. అమరావతి అనేది అన్ని కులాలవారికి బహుళ ప్రయోజనాలు చేకూర్చేదని అన్నారు. బేషజాలకు పోకుండా రాష్ట్రాన్ని బాగు చేయాలని సూచించారు. మండలి రద్దు బిల్లును వెనక్కి తీసుకునే మాదిరిగా మూడు రాజధానుల బిల్లు కూడా వెనిక్కి తీసుకోవాలన్నారు. ఇదే మాదిరిగా మూడు రాజధానులు ప్రకటిస్తే ఆంద్రప్రదేశ్ అగ్నిగుండంగా మారుతుందన్నారు. అమరావతినే ఏపీ రాజధానిగా ప్రకటన చేయాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement