Abn logo
May 26 2020 @ 13:22PM

200 నిర్మాత‌ల‌తో విజయ్‌సేతుపతి చిత్రం..!

రెండు కోట్ల బడ్జెట్‌..  200 మంది నిర్మాతలు... 30 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేసి తమిళంలో సినిమా నిర్మిస్తుండడం ఆసక్తి రేపుతోంది. సినీ పరిశ్రమకు చెందిన 200 మంది చెరో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ సినిమా నిర్మిస్తున్నారట. ఇందులో మక్కల్‌సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ప్రత్యేక పాత్రలో నటించనున్నారని కోలీవుడ్‌ టాక్‌. ఇక ఈ సినిమాలో నటించే తారలు, పనిచేసే సాంకేతిక నిపుణులందరికీ సినిమాకు వచ్చే లాభాల ఆధారంగా పారితోషికం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెకుకు పలువురు థియేటర్‌ యజమానుల సహకారం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement