Abn logo
May 30 2020 @ 11:38AM

రూ.10 కోట్ల‌కు త‌గ్గ‌నంటున్నాడా విజ‌య్ సేతుప‌తి..!

ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్‌సేతుపతి ఉన్నట్టుండి విలన్‌ పాత్రల్లో నటిస్తున్నా ఆయనకు ఊహించనంత పారితోషికం అందుతోందని కోలీవుడ్‌ వర్గాలు కోడైకూస్తున్నాయి. విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రంలో విజయ్‌సేతుపతి విలన్‌గా నటించారు. ఆ చిత్రానికి విజయ్‌సేతుపతికి రూ.10 కోట్ల వరకు పారితోషికం లభించిందని చెబుతున్నారు. ఇదే విధంగా ‘దేవర్‌మగన్‌-2’ గా భావిస్తున్న ‘తలైవన్‌ ఇరికిండ్రాన్‌’ చిత్రంలో నటించేందుకు కూడా విజయ్‌సేతుపతి పదికోట్ల మేరకు పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రేవతి, ఆండ్రియా, పూజాకుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement