Abn logo
Jul 9 2020 @ 10:21AM

మెగాస్టార్‌తో విజయ్ దేవరకొండ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న `ఆచార్య` సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత మలయాళ `లూసిఫర్` రీమేక్‌లో చిరంజీవి నటించబోతున్నారు. 


`సాహో` డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. మలయాళ `లూసిఫర్‌`లో  ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగులో విజయ్ చేయబోతున్నాడట. తొలుత ఈ పాత్ర కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా విజయ్ పేరు తెర మీదకు వచ్చింది. మరి, చిరంజీవితో పాటు `లూసిఫర్` రీమేక్‌లో ఎవరు కనిపిస్తారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement