Abn logo
Mar 1 2021 @ 04:16AM

హైదరాబాద్‌ గెలిచినా..

సూరత్‌: విజయ్‌ హజారే ట్రోఫీలో వరుస ఓటములతో నాకౌట్‌ చేరడంలో విఫలమైన హైదరాబాద్‌ జట్టు చివరి మ్యాచ్‌లో మాత్రం గెలిచింది. గ్రూప్‌-ఎలో భాగంగా ఆదివారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 2 పరుగులతో గోవాను ఓడించింది. ఈ గ్రూప్‌ నుంచి గుజరాత్‌ 20 పాయింట్లతో టాపర్‌గా నాకౌట్‌కు చేరింది. హైదరాబాద్‌ 12 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. తొలుత కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (150), తిలక్‌వర్మ (128) సెంచరీలతో మెరవడంతో హైదరాబాద్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 345 పరుగులు చేసింది. భారీ ఛేదనలో గోవా 50 ఓవర్లలో 343/5 స్కోరు చేసి ఓడింది. ఏకాంత్‌ కేర్కర్‌ (169), స్నేహల్‌ (116) సెంచరీలతో పోరాడినా ఓటమి తప్పలేదు. గ్రూప్‌-బిలో ఆంధ్రా, గ్రూప్‌-సిలో కర్ణాటక జట్లు నాకౌట్‌కు చేరాయి. 

Advertisement
Advertisement
Advertisement