Oct 19 2021 @ 10:16AM

Arya3 : అల్లు అర్జున్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ?

సుకుమార్ టాలీవుడ్ లో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకొన్న ట్రెండీ లవ్ స్టోరీ ‘ఆర్య’. అప్పటి యూత్ కు ఆ తరహా ప్రేమకథ కొత్తగా అనిపించి బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత సుక్కూ అల్లు అర్జున్ తోనే  దానికి సీక్వెల్ రూపొందించారు. మొదటి భాగం అంత స్థాయిలో విజయం సాధించలేకపోయినా.. బన్నీ యాక్టింగ్, మ్యూజిక్, డ్యాన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. సుకుమార్ స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి ‘ఆర్య 3’ తీస్తానని రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని కూడా అల్లు అర్జున్ తో తీస్తారనుకున్నారు అభిమానులు. కానీ అతడి ప్లేస్ లో విజయ్ దేవరకొండను హీరోగా సుకుమార్ ఎంపిక చేయబోతున్నారట. 



నిజానికి సుకుమార్ ‘రంగస్థలం’ తర్వాత విజయ్ తో సినిమాను అనౌన్స్ చేశారు. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కాలి. అయితే అనూహ్యంగా అల్లు అర్జున్ ‘పుష్ప’ ట్రాక్ మీదకొచ్చింది. ఇది కంప్లీట్ అయ్యాకా.. సుకుమార్ తదుపరి చిత్రంగా విజయ్ దేవరకొండతో ‘ఆర్య 3’ని తెరకెక్కిస్తారట. ఆమేరకు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. మరి ‘ఆర్య’ గా అల్లు అర్జున్ కేరక్టరైజేషన్ ను విజయ్ ఏ మేరకు మ్యాచ్ చేస్తారో చూడాలి.