Abn logo
Jul 7 2020 @ 12:56PM

క్రేజీ స్టార్‌తో మ‌హేశ్ సినిమా..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి సినిమాలను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అడివిశేష్ హీరోగా ‘మేజ‌ర్‌’ సినిమాను సోనీ పిక్చ‌ర్స్ సంస్థ‌తో క‌లిసి మ‌హేశ్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు మ‌రో సినిమాను నిర్మించ‌డానికి మహేశ్ సిద్ధ‌మ‌య్యార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల మేర‌కు... విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమాను నిర్మించ‌డానికి మ‌హేశ్ ప్లాన్ చేస్తున్నార‌ని టాక్‌. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్‌తో సినిమా చేస్తోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ.. మ‌హేశ్ రిక్వెస్ట్‌ను ఒప్పుకుంటారో లేదో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement