Jul 31 2021 @ 14:16PM

విజయ్ ‘బీస్ట్’ నెక్స్‌ట్ షెడ్యూల్ ఎక్క‌డంటే?

కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బీస్ట్‌’. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీత బాణీలను సమకూర్చుతున్నారు. ఈ చిత్ర యూనిట్ నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ఆగస్ట్ 2 నుంచి రష్యాలో జరగబోతున్నట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమా తొలి షెడ్యూల్ జార్జియాలో జ‌ర‌గ‌గా, సెకండ్ షెడ్యూల్ చెన్నైలో జ‌రిగింది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. 

Otherwoodsమరిన్ని...