Abn logo
Jan 21 2021 @ 14:31PM

విశాఖలో డీమార్ట్, స్పెన్సర్లపై విజిలెన్స్ దాడులు

విశాఖ: నగరంలోని ప్రముఖ వ్యాపార సంస్థలు అయిన డీమార్ట్, స్పెన్సర్ లపై విజిలెన్స్  అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అలాగే పలు వ్యాపార సముదాయాల పై కూడా విజిలెన్స్ అధికారులు  దాడులు నిర్వహించారు. ఈ సంఘటన నగరంలో సంచలనం రేపింది. గత కొంత కాలంగా నగరంలోని ప్రముఖ వ్యాపార సంస్థలలో కాలం చెల్లిన వస్తుపులు అమ్ముతున్నారని అనేక మంది వినియోగదారులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం విజిలెన్స్ అధికారులు  డీమార్ట్, స్పెన్సర్ లపై  దాడులు  చేశారు. వాటితో పాటు మరికొన్ని  వ్యాపార సముదాయలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో కాలం చెల్లిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు నాణ్యతలేని వస్తువులను కూడా  పట్టుకున్నారు. వాటి నాణ్యతను తెలుసుకోవడానికి ల్యాబ్ కు పంపిస్తామని వారు తెలిపారు. 

ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత అవసరమైతే కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అధికారి  స్వరూప పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ ఎవరైనా వ్యాపారులు నాణ్యతలేని వస్తువులు అమ్మితే విజిలెన్స్ అధికారులకు  ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే కల్తీ పదార్థాలు అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్వరూప హెచ్చరించారు.

Advertisement
Advertisement
Advertisement