Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిన్నారి వైద్యఖర్చులకు ఆర్థిక సాయం

బాలాయపల్లి, డిసెంబరు 7: మండలంలోని నిండలి గ్రామానికి చెందిన వాన శివ కుమారుడు కార్తీక్‌(8)  కేన్సర్‌తో బాధపడుతున్నాడు.  ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయురాలి సమాచారంతో చికిత్స కోసం  పలువురు ఆర్థిక సాయం చేశారు. రాపూరుకు చెందిన కరుణామయి, వెంకటగిరి చెందిన సుమన్‌ ప్రజా దంతవైద్యశాల, గూడూరుకు చెందిన ఆదిశంకర  పాఠశాల, జీపీఎన్‌ పాఠశాల పూర్వ విద్యార్థులు, బాలాయపల్లికి చెందిన వరసిద్ధి వినాయక పాఠశాల, రాజా ఎలక్ట్రికల్‌ ఫ్రెండ్స్‌ వారు మంగళవారం రూ. 85 వేలు ఆర్థిక సాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్‌, బీసీఆర్‌ ప్రసాద్‌, త్యాగరాజు, డాక్టర్‌ సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement