Abn logo
Sep 17 2021 @ 19:05PM

Viral Video: స్టేడియంలో దంపతులు చేసిన ఆ పనికి నెటిజన్లు ఫిదా..!

మియామీ: అమెరికాలోని మియామీలో ఉన్న హార్డ్ రాక్ స్టేడియంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేడియంలోకి వచ్చిన ఓ పిల్లి పైన ఉన్న గ్యాలరీ నుంచి అమాంతం కిందపడిపోవడం వీడియోలో ఉంది. దాంతో కింద గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులు చాకచక్యంగా ఆ పిల్లిని కాపాడారు. ఇద్దరు దంపతులు తమతో పాటు తెచ్చుకున్న అమెరికా జాతీయ జెండాలో దాన్ని కిందపడకుండా పట్టుకున్నారు. 


ఇవి కూడా చదవండి..

Kuwait కు వెళ్తున్నారా..? పొరపాటున కూడా వీటిని తీసుకెళ్లొద్దు..!

American సెనేట్‌లో కీలక బిల్లు.. NRI పిల్లలకు భారీ మేలు!


దాంతో పిల్లి బతికిపోయింది. క్రైగ్ క్రామర్, కింబర్లీ క్రామర్ ఇలా పిల్లిని కాపాడారు. ప్రతియేటా జరిగే ఇంటర్ కాలేజీ ఫుట్‌బాల్ మ్యాచులను చూసేందుకు గత ఏడేళ్లుగా స్టేడియంకు వస్తున్నట్లు ఈ సందర్భంగా క్రామర్ దంపతులు తెలిపారు. కానీ, ఈ ఏడాది జరిగిన ఈ ఘటన తాము ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

 



ఇవి కూడా చదవండిImage Caption

అమెరికా నగరాల్లోమరిన్ని...