Abn logo
Mar 25 2020 @ 19:11PM

‘వెంకీమామ’ ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేశాడా?

క్లాస్, మాస్‌, ఫ్యాన్స్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులందరినీ థియేటర్లకు రప్పించగలిగిన సత్తా ఉన్న హీరో ఎవరంటే  టక్కున గుర్తొచ్చేది విక్టరీ వెంకటేశ్‌. యంగ్, సీనియర్ హీరోలు, దర్శకులు, నిర్మాతలతోనూ ఈ హీరోకు మంచి సంబంధాలు ఉన్నాయి. రెమ్యూనరేషన్ విషయంలో కూడా కూల్‌గా ఉంటారని టాలీవుడ్‌లో టాక్ ఉంది. చిన్న, పెద్దా హీరోలనే తేడాలు లేకుండా మల్టీస్టారర్లు చేయడానికి వెంకీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలా మహేశ్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్ కల్యాణ్‌‌తో ‘గోపాల గోపాల’, వరుణ్ తేజ్‌తో ‘ఎఫ్2’, అల్లుడు నాగచైతన్యతో ‘వెంకీమామ’ సినిమాలో నటించారు. 


అయితే ఇప్పుడు వెంకీ రెమ్యూరేషన్ విషయంలో ఆసక్తికర విషయం ఒకటి ప్రచారం జరుగుతోంది. తన తదుపరి సినిమాకు ఈ క్లాస్ హీరో.. రూ. 10 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అది కూడా వెంకటేశ్‌తో సినిమా తీసి నష్టపోయిన నిర్మాతకే చెప్పారట. ఒక్కసారిగా వెంకీ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్మాత షాక్ అయ్యారట. డిమాండ్ చేసినంత కాకపోయినా వెంకీ రేంజ్‌కు తగ్గట్టుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని నిర్మాత చెప్పారట. కానీ వెంకీ మాత్రం వెనక్కి తగ్గడంలేదట. తాను ఆశించిన మొత్తం ఇస్తేనే సినిమాకు రెడీ అవుతానని అంటున్నారట. మరి వెంకీ మనసు మారుతుందేమో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement