Advertisement
Advertisement
Abn logo
Advertisement

న్యాయం చేయాలని బాధితుల ఆందోళన

కడప(క్రైం), నవంబరు 27: తమకు న్యాయం చేయాలని కడప వై-జంక్షన్‌ సమీపంలోని శ్రీవిష్ణుప్రియ ఇన్ఫా సర్వీస్‌ కార్యాలయం వద్ద బాధితులు శనివారం ఆందోళనకు దిగారు. తమకు జిల్లాలో బీఎ్‌సఎన్‌ఎల్‌ సెల్‌ఫోన్‌ టవర్ల కాంట్రాక్టు వచ్చిందని, వాటిని సబ్‌ కాంట్రాక్టుకు ఇస్తామని చెప్పి కొందరి వద్ద నుంచి ఆ కార్యాలయం అధినేత డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. తమ వద్ద డబ్బులు తీసుకుని సబ్‌ కాంట్రాక్టు ఇవ్వకపోగా తాము కట్టిన డబ్బులు కూడా ఇవ్వలేదని బాధితులు ఆందోళన చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారు ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.80 వేలు చొప్పున జిల్లాలో 126 సెల్‌ టవర్లకు డబ్బులు తీసుకున్నాడని తెలిపారు. తమకు సబ్‌ కాంట్రాక్టు ఇవ్వకపోవడంతో పాటు డబ్బులు వెనక్కు ఇవ్వకపోవడంతో గత ఏడాది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారన్నారు. కానీ ఇంతవరకు తమకు న్యాయం జరగలేదంటూ బద్వేలుకు చెందిన రవిశంకర్‌రెడ్డి అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బ్లూకోల్డ్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని చిన్నచౌకు పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనిపై జిల్లాలోని పలు స్టేషన్లలో కేసులు నమోదు చేశారని, న్యాయం చేస్తామంటూ సీఐ అశోక్‌ రెడ్డి హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Advertisement
Advertisement