విక్కీ, Katrina Kaif పెళ్లి కోసం రాయల్ కళ్యాణ మండపం.. ఖర్చు లక్షల్లో..

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ పెళ్లి గురించి జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరి వివాహానికి సంబంధించి రోజుకో వార్త బయటికి వస్తూ వారి ఫ్యాన్స్‌లో ఎగ్జాయిట్‌మెంట్‌ పెంచుతోంది. తాజాగా మరో న్యూస్ హల్‌చల్ చేస్తోంది.


రాజస్థాన్‌లోని సవోయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో డిసెంబర్ 7 నుంచి 9న జరగనున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే అతిథులందరికీ ఆహ్వానాలు పంపడమే కాకుండా.. వారికోసం ఓ టౌన్ 45 హోటల్స్‌లో రూమ్స్ బుక్ చేశారు. అంతేకాకుండా వరుడు, వధువు కోసం ఒక రాత్రికి 8 లక్షల ఖర్చుతో రాజా రతన్ సింగ్ రూమ్, రాణి పద్మావతి రూమ్‌ని బుక్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా వారి పెళ్లి కోసం కొన్ని లక్షల ఖర్చు చేసి రాయల్ లుక్‌లో ఓ కళ్యాణ మండపాన్ని తయారు చేయించారట ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహకులు.


అలాగే విక్యాట్ వెడ్డింగ్‌కి 120 మందిదాకా సెలబ్రిటీలు హాజరుకానున్నట్లు.. వీరి కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాగా, వీరి అతిథుల జాబితాలో శశాంక్ ఖైతాన్, కరణ్ జోహార్, అలియా భట్, అలీ అబ్బాస్ జాఫర్, రోహిత్ శెట్టి, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ, వరుణ్ ధావన్, నటాషా దలాల్ ఉన్నట్లు తెలియవస్తోంది.

Advertisement

Bollywoodమరిన్ని...